రోదసిలో రెండు వింత నక్షత్రాలు.. ప్రతి 20 నిమిషాలకు రేడియో తరంగాలు
- గుర్తించిన ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
- 2018 నుంచి వీటి సమాచారం నమోదు
- 2021లో తొలిసారి గుర్తింపు
- ఒకటి మూడు నెలల్లోనే మాయం
- మరోటి 33 ఏళ్లుగా కనిపిస్తున్న వైనం
రోదసిలోని రెండు వింత నక్షత్రాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి రెండు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రేడియో తరంగాలు పంపుతుండడంతో వాటిపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు ఎవరూ చూడని వింత నక్షత్రాలను తాము కనుగొన్నట్టు ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాధారణంగా న్యూట్రాన్ తారలు వాటిచుట్టూ అవి తిరుగుతూ శక్తిని విడుదల చేస్తాయని కానీ, తాజాగా తాము గుర్తించిన తారలు వింత ప్రవర్తనను కలిగి ఉన్నాయని తెలిపారు.
2018 నుంచీ వీటి సమాచారం నమోదవుతోందని, 2021లో తొలిసారి వాటిని గుర్తించినట్టు వివరించారు. మూడు నెలలపాటు మెరిసిన ఓ తార ఆ తర్వాత మాయమైందని, ఇది మాగ్నెటార్ తరహాకు చెందిన అరుదైన వస్తువుగా అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. మాగ్నటార్‌లు సాధారణగా కొన్ని సెకన్ల వ్యవధిలోనే సంకేతాల్ని పంపుతాయి. తాజాగా గుర్తించినవి మాత్రం 18 నిమిషాలకోమారు పంపుతున్నాయి. రోదసిలో ఇలాంటివి మరెక్కడైనా ఉన్నాయా? అని గాలిస్తే గతేడాది జూన్‌లో మరో తార కనిపించిందని, అది ప్రతి 21 నిమిషాలకు ఒకసారి సంకేతాల్ని పంపిస్తున్నట్టు గుర్తించామని అధ్యయనానికి నేతృత్వం వహించిన నటాషా హర్లీ వాకర్ తెలిపారు. ఒకటి మూడు నెలలు మాత్రమే కనిపించడం, మరోటి 33 ఏళ్లుగా ఎందుకు కనిపిస్తోందన్న దానిపై తమ వద్ద ఇంకా సమాధానం లేదని పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.