ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా బుమ్రా
- ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
- బుమ్రాకు జాతీయ జట్టు పగ్గాలు
- ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్ తో టీ20 సిరీస్
ఇటీవల కాలంలో బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటున్నాయి. తాజాగా, ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లకు టీమిండియా కెప్టెన్ గా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను నియమించింది. గాయం కారణంగా సుదీర్ఘకాలంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న బుమ్రాను ఏకంగా కెప్టెన్ గా నియమించడం చర్చనీయాంశంగా మారింది.
కొంతకాలం కిందట శిఖర్ ధావన్ ను ఇలాగే పలు సిరీస్ లకు కెప్టెన్ గా నియమించడం తెలిసిందే. ఇప్పుడతను జట్టులోనే లేడు. మరి బుమ్రా భవితవ్యం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
ఐర్లాండ్ జట్టుతో ఆగస్టులో టీమిండియా జట్టు 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ సిరీస్ లో పాల్గొనే భారత జట్టుకు బుమ్రా సారథ్యం వహించనున్నాడు. ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమిండియా జట్టుకు కెప్టెన్ గా నియమితుడైన రుతురాజ్ గైక్వాడ్... ఐర్లాండ్ తో సిరీస్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఐర్లాండ్ తో ఆగస్టు 18 నుంచి 23 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ లు డబ్లిన్ నగరంలో జరగనున్నాయి.
ఐర్లాండ్ తో సిరీస్ కు ఎంపికైన టీమిండియా సభ్యులు వీరే...
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్.