ఆగస్టు 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండో సీజన్... రేపు ఆటగాళ్ల వేలం
- ఇప్పటికే ఆంధ్రా ప్రీమియర్ లీగ్-1 నిర్వహించిన ఏసీఏ
- నేడు సెకండ్ సీజన్ ఆవిష్కరణ కార్యక్రమం
- తొలి సీజన్ విజయవంతమైందన్న ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి
- రెండో సీజన్ లో 6 జట్లు పాల్గొంటాయని వెల్లడి
ఐపీఎల్ తరహాలో ఆంధ్రా క్రికెట్ సంఘం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోటీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆంధ్రా ప్రీమియర్ లీగ్-1 నిర్వహించింది. తాజాగా విశాఖలోని పీఎం పాలెం స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2 టోర్నీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనిపై ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి స్పందించారు.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్-1 విజయవంతమైందని తెలిపారు. మొదటి లీగ్ కంటే రెట్టింపు ఉత్సాహంతో రెండో సీజన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2లో భాగంగా ఆగస్టు 16 నుంచి 27 వరకు మ్యాచ్ లు జరుగుతాయని వెల్లడించారు. ఇందులో 6 జట్లు పాల్గొంటాయని వివరించారు. ఆటగాళ్ల ఎంపిక కోసం రేపు వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నామని గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.