భారీ రిలీజ్ కి రెడీ అవుతున్న ‘ఎల్‌జీఎం’
- సాక్షి సింగ్ ధోని నిర్మాతగా రూపొందిన 'LGM'
- హీరో .. హీరోయిన్ గా హరీశ్ కల్యాణ్ - ఇవానా
- కీలకమైన పాత్రలో కనిపించనున్న నదియా
- ఆగస్టు 4వ తేదీన సినిమా విడుదల
కుటుంబంలోని మనుషులు అందరూ ఒకేలా ఉండాలనేం లేదు.. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. దీని వల్ల మనస్పర్దలు వస్తుంటాయి .. పోతుంటాయి. కానీ బంధాలు, బంధుత్వాలను మనం విడిచి పెట్టలేం. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి, అమ్మాయిలకు మనసులో తెలియని భయాలు ఎన్నో ఉంటాయి. మరీ ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య ఉండే రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అలా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి, కాబోయే అత్తగారి గురించి భయపడుతుంది. అందుకోసం ఆమెతో కలిసి కొన్ని రోజుల పాటు ట్రావెల్ చేయాలనుకుంటుంది. అందుకు ఒప్పుకున్న అత్తా కోడళ్ల మధ్య ఉండే కండిషన్స్ ఏంటి? చివరకు వారిద్దరి మనస్తత్వాలు కలిశాయా? అనే వైవిధ్యమైన పాయింట్‌తో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎల్‌జీఎం’. ఆగస్ట్ 4న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్నాయి.
ఈ సినిమాకి హరీష్ కళ్యాణ్ .. ఇవానా .. నదియా పాత్రలే ప్రధాన బలం. పెళ్లికి ముందే కాబోయే అత్తగారికి కండిషన్స్ పెట్టే గడసరి కోడలుగా ఇవానా కనిపిస్తుంది. ఆమె నటన ఎలా ఉండబోతుందనేది ట్రైలర్‌లో చిన్న టచ్‌తో దర్శకుడు రమేష్ తమిళ్ మణి చూపించాడు. ఇక కొడుకు ప్రేమ కోసం కోడలు ట్టిన కండీషన్స్‌ను ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే తల్లి పాత్రలో నదియా నటించారు. కాబోయే భార్య.. ప్రేమగా పెంచుకున్న తల్లి మధ్య భావోద్వేగాలతో నలిగిపోతూ ఇబ్బంది పడే అబ్బాయిగా హరీష్ కళ్యాణ్ నటించాడు. ఇక సినిమాలో యోగిబాబు తనదైన కామెడీతో నవ్వించనున్నారు.