హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. రేపు ఉదయం వరకు ఒక మోస్తరు వర్షం

  • ఇటీవలి వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగరం
  • కూకట్‌పల్లి, సికింద్రాబాద్ సహా పలుచోట్ల వర్షం
  • బేగంబజార్, ప్యాట్నీ, పంజాగుట్టలలోనూ వర్షం
హైదరాబాద్‌లో మళ్లీ వర్షం కురుస్తోంది. ఇటీవల పదిపదిహేను రోజుల పాటు వరుస భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో చాలామంది భాగ్యనగరవాసులు ఇటీవల తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలూ మూతబడ్డాయి. ఇప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, బేగంబజార్, ప్యాట్నీ, పంజాగుట్ట, హిమయత్ నగర్, హైదర్ గూడ, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట, అమీర్ పేట, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ వర్షం రేపు ఉదయం వరకు ఉండే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా, రేపటి వరకు ఉరుములతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


More Telugu News