ఏపీ అప్పులపై రఘురామకృష్ణరాజు ప్రశ్న.. వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్

  • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎఫ్‌ఆర్‌బీఎంను పర్యవేక్షిస్తోందన్న ఆర్థికమంత్రి
  • 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.2,64,451 కోట్లుగా ఉన్నాయని వెల్లడి
  • 2023 మార్చి నాటికి రూ.4,42,442కి చేరుకున్నాయన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. అభివృద్ధి లేకపోయినప్పటికీ ఏపీని జగన్ అప్పుల కుప్పగా మారుస్తున్నారని విపక్షాలు చెబుతుండగా, కేంద్రం నిబంధనల మేరకే అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నామని వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అప్పులపై లోక్ సభలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎఫ్‌ఆర్‌బీఎంను పర్యవేక్షిస్తోందని ఆమె తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రం అప్పులు చేస్తోందని స్పష్టం చేశారు. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.2,64,451 కోట్లు కాగా, 2023 మార్చి నాటికి రూ.4,42,442 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. గత నాలుగేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లుగా తేల్చారు. 

 


More Telugu News