రొమాన్స్ కు వయసు అడ్డురాదు: షబానా అజ్మీతో 'ముద్దుసీను'పై ధర్మేంద్ర స్పందన
- 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' చిత్రంలో ధర్మేంద్ర, షబానా ముద్దు సన్నివేశం
- సినిమాకు ఆ సన్నివేశం అవసరమన్న ధర్మేంద్ర
- తాను, షబానా ఇబ్బంది పడలేదని వ్యాఖ్య
రణవీర్ సింగ్, అలియా భట్ కాంబినేషన్ లో కరణ్ జొహార్ తెరకెక్కించిన 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' చిత్రం ప్రేక్షకుల ఆదరణను చూరగొంటోంది. ఈ చిత్రంలో జయా బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీలు కీలక పాత్రలను పోషించారు. మరోవైపు ఈ చిత్రంలో ధర్మేంద్ర, షబానాలకు ఒక పాట ఉంటుంది. పాట కొనసాగుతుండగా ప్రేక్షకులు ఎవరూ ఊహించని విధంగా ఇద్దరూ ముద్దు పెట్టుకునే సన్నివేశం వస్తుంది.
దీనిపై ధర్మేంద్ర స్పందిస్తూ... రొమాన్స్ కు వయసు అడ్డుకాదని... ఏజ్ ఒక నంబర్ మాత్రమేనని చెప్పారు. ముద్దు పెట్టుకోవడం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఏ వయసులోనైనా ఒకరిపై మరొకరు ప్రేమను పంచుకోవచ్చని అన్నారు. ముద్దు సన్నివేశం గురించి కరణ్ తమతో చెప్పినప్పుడు తాను ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కు గురి కాలేదని చెప్పారు. సినిమాకు తమ ముద్దు సన్నివేశం అవసరమనే విషయాన్ని తాను, షబానా, కరణ్ అర్థం చేసుకున్నామని తెలిపారు. ముద్దు సన్నివేశం సందర్భంగా తాను కానీ, షబానీ కానీ ఇబ్బంది పడలేదని చెప్పారు.