రాంచీ రోడ్లపై 70వ దశకం నాటి పాంటియాక్ కారును డ్రైవ్ చేస్తూ ధోనీ.... వీడియో ఇదిగో!
- ధోనీ గ్యారేజిలో వింటేజ్ కార్లు
- 50 ఏళ్ల నాటి కారును బయటికి తీసిన ధోనీ
- ఈ విదేశీ కారుకు ఎడమ వైపున స్టీరింగ్
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే పిచ్చి అని తెలిసిందే. అలాగని, ధోనీ వద్ద కార్ల కలెక్షన్ తక్కువ అనుకుంటే పొరబడ్డట్టే. ఆధునిక కార్లతో పాటు ఈ తరం వారికి తెలియని పాత మోడల్ కార్లు కూడా ధోనీ గ్యారేజిలో కనిపిస్తాయి.
ధోనీ ఇంట ఉండే ప్రత్యేక గ్యారేజి గురించి చెప్పాలంటే.... ఓ షోరూంకి వెళ్లినట్టే ఉంటుంది. అక్కడ అనేక బైకులు, కార్లు కొలువుదీరి ఉంటాయి.
తాజాగా, ధోనీ రాంచీ రోడ్లపై 1973 నాటి పాంటియాక్ ట్రాన్స్ ఏఎం ఎస్ డీ-455 కారును డ్రైవ్ చేస్తూ కెమెరా కంటపడ్డాడు. ఇది విదేశీ కారు... దీని స్టీరింగ్ వీల్ ఎడమవైపున ఉంటుంది. పాత మోడల్ కారు అయినప్పటికీ, ధోనీ దీన్ని ఇప్పటికీ మంచి కండిషన్ లో పెట్టడం విశేషం.
ధోనీ ఎంచక్కా పాంటియాక్ కారును నడపుతూ ఆస్వాదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.