'బేబి' 17 రోజుల వసూళ్లు ఇవే!

'బేబి' 17 రోజుల వసూళ్లు ఇవే!
  • ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన 'బేబి'
  • నిన్నటి 17 రోజులను పూర్తిచేసుకున్న సినిమా 
  • నిన్నటితో 81.9 కోట్ల గ్రాస్ వసూలు
  • 100 కోట్ల మార్క్ దిశగా వెళుతున్న 'బేబి'
ప్రేమకథా చిత్రాలు యూత్ కి కనెక్ట్ అయితే ఎలా ఉంటుందనేది 'బేబి' సినిమా మరోసారి నిరూపించింది. ఎస్.కె.ఎన్. నిర్మించిన ఈ సినిమాకి, సాయిరాజేశ్ దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ .. వైష్ణవి చైతన్య .. విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూర్చాడు. 

ఈ నెల 14వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ ఓపెంగ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. రెండు వారాల్లో కొత్త సినిమాలు థియేటర్లకు వచ్చినప్పటికీ, ఆ పోటీని తట్టుకుంటూ ముందుకు వెళుతోంది. 'బ్రో' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఈ సినిమా థియేటర్లలో నిలబడటం విశేషం. 

'బేబి' సినిమా విడుదలై నిన్నటితో 17 రోజులు పూర్తయ్యాయి. ఈ 17 రోజుల్లో ఈ సినిమా 81.9 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు కూడా. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, 100 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలు బలంగానే ఉన్నాయని అంటున్నారు.  


More Telugu News