జ్ఞానవాపి మసీదుపై యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు!

  • జ్ఞానవాపిని మసీదు అంటేనే వివాదం అవుతుందన్న యోగి
  • ‘చారిత్రక తప్పిదానికి’ ముస్లిం పక్షం పరిష్కారం చూపాలని తీవ్ర వ్యాఖ్యలు
  • మసీదులో త్రిశూలం ఎందుకు ఉందని ప్రశ్న
యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపిని మసీదు అని పిలవలేమని, అలా పిలిస్తే వివాదం అవుతుందని అన్నారు. ఈ కేసులో ముస్లిం పక్షం ముందుకు వచ్చి తమ ‘చారిత్రక తప్పిదానికి’ పరిష్కారం చూపాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఏఎన్‌ఐ వార్తా సంస్థ పాడ్‌కాస్ట్‌లో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘‘జ్ఞానవాపిని మసీదు అని పిలవలేం. అలా పిలిస్తేనే వివాదం అవుతుంది. భగవంతుడు ఎవరికైతే దృష్టిని ప్రసాదించాడో ఆ వ్యక్తి చూడాలి. మసీదులో త్రిశూలం ఎందుకు ఉంది? మేం దాన్ని అక్కడ ఉంచలేదు. అక్కడ జ్యోతిర్లింగం ఉంది. దేవుళ్ల ప్రతిమలు ఉన్నాయి” అని చెప్పారు. ‘‘మసీదులో గోడలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఏవో చెబుతున్నాయి. ‘చారిత్రక తప్పిదానికి’ పరిష్కారం చూపేందుకు ముస్లిం సమాజం ఓ ప్రతిపాదనతో రావాలి” అని చెప్పారు.


More Telugu News