ఇంతవరకూ నేను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు: జేడీ చక్రవర్తి
- 'దయా' వెబ్ సిరీస్ చేసిన జేడీ
- ఆగస్టు 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
- 'శివ' సినిమాను గురించి ప్రస్తావించిన జేడీ
- హీరో కావడం కోసం వెయిట్ చేశానని వివరణ
- 'మనీ మనీ' డైరెక్టర్ కృష్ణవంశీ అని వెల్లడి
జేడీ చక్రవర్తి హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో 'దయా' వెబ్ సిరీస్ రూపొందింది. ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో జేడీ బిజీగా ఉన్నాడు. తాజాగా 'ఫిల్మ్ ట్రీ' యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను పంచుకున్నాడు.
"నేను 'శివ' సినిమాతో ఎంట్రీ ఇచ్చాను .. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత నేను సినిమాలు చేయనని చెప్పాను. రాము బ్యాచ్ కి కొంచెం పిచ్చి ఉందిలే అని అప్పుడే అనుకున్నారు. నేనేమో హీరోను కావాలని ఫిక్స్ అయ్యాను. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి .. ఆ తరువాత 'మనీ' సినిమాలో హీరోగా చేశాను. ఆ తరువాత నుంచి హీరోగానే చేసుకుంటూ ముందుకు వెళ్లాను" అన్నారు.
'మనీ' తరువాత శివనాగేశ్వరావు 'మనీ మనీ' చేయవలసి ఉంది. అది ఆయనకి భరద్వాజ్ గారితో ఉన్న కమిట్ మెంట్. అప్పుడు కృష్ణవంశీతో రాము ఆ సినిమాను తీయించి, డైరెక్టర్ గా శివ నాగేశ్వరరావు పేరు వేయించాడు. నాకు తెలిసి ఇంతవరకూ ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. చెప్పకుండా దాచడానికి ఇదేం 'గులేబకావళి కథ' కాదు" అంటూ చెప్పుకొచ్చాడు.