వర్షాల ఎఫెక్ట్.. తిరుమలలో ఖాళీగా క్యూలైన్లు

  • నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు
  • వర్షాలు, వరదల కారణంగా తిరుమలలో తగ్గిన రద్దీ
  • నో వెయిటింగ్ రూల్ ను అమలు చేస్తున్న టీటీడీ
దేశవ్యాప్తంగా వర్షాలు, వరదల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. క్యూ లైన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు నేరుగా వెళ్లిపోతున్నారు. రద్దీ తగ్గడంతో టీటీడీ అధికారులు నో వెయిటింగ్ రూల్ ను అమలు చేస్తున్నారు. దీంతో కంపార్ట్ మెంట్ లో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులు శ్రీవారిని నేరుగా వెళ్లి దర్శించుకుంటున్నారు. సాధారణంగా తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతుంటుంది. ఏ సీజన్ లో అయినా ఎంతో కొంత రద్దీ తప్పదు. క్యూలైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది. 

వరుసగా మూడు రోజుల సెలవుల నేపథ్యంలో ఆదివారం వరకూ భక్తులతో కిటకిటిలాడిన తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో స్వామి వారి దర్శనం సులభంగా అవుతోందని అధికారులు చెప్పారు. కాగా, ఆదివారం నాడు శ్రీవారిని 85,258 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది. హుండీ ద్వారా రూ.4.28 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొంది.


More Telugu News