వచ్చే ఎన్నికల్లో ఓడిపోయి ప్రధాని మోదీ విదేశాల్లో స్థిరపడతారు: లాలూ ప్రసాద్
- 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతానని మోదీ ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్య
- విదేశాల్లో ఆశ్రయం పొందాలని చూస్తున్నారన్న ఆర్జేడీ అధినేత
- అందుకే ఈ మధ్య ఎక్కువ విదేశాలు చుట్టొస్తున్నారని ఎద్దేవా చేసిన సీనియర్ నేత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామని, విదేశాల్లో ఆశ్రయం పొందాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడటంపై ప్రధాని మోదీ కొన్ని రోజుల కిందట విమర్శలు చేశారు. అది ‘క్విట్ ఇండియా’ అని ఎద్దేవా చేశారు.
ఈ కూటమిని ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీలు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ స్పందించారు. ‘ప్రధాని మోదీనే దేశాన్ని వదిలేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మధ్య ప్రధాని మోదీ ఇన్ని దేశాలను సందర్శించడానికి కారణం ఇదే. పిజ్జాలు, మోమోలు తింటూ ప్రశాంతంగా జీవించే ప్రదేశాన్ని వెతుకుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.