గోదారోళ్లం .. నవ్వుతూ నరాలు లాగేస్తాం: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఫస్టు గ్లింప్స్ రిలీజ్!
- విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
- గోదావరి నేపథ్యంలో నడిచే కథ
- దర్శకుడిగా మారిన లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య
- సంగీతాన్ని అందించిన యువన్ శంకర్ రాజా
- ప్రత్యేకమైన పాత్రను పోషించిన అంజలి
విష్వక్సేన్ తాజా చిత్రానికి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. లిరిక్ రైటర్ కృష్ణచైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ఇది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ను బట్టే ఈ సినిమా గోదావరి నేపథ్యంలో నడుస్తుందనే విషయం అర్థమైపోతోంది. ఫస్టు గ్లింప్స్ చూస్తుంటే, గోదావరి కేంద్రంగా సాగే ఇసుక మాఫియా చుట్టూ ఈ కథ నడవనుందని తెలుస్తోంది.
ఇసుక మాఫియా .. ఈ విషయంలో ముఠాల మధ్య గొడవలు ప్రధానంగా ఈ కథ కొనసాగుతుందని అనిపిస్తోంది. "అన్నా మేము గోదారోళ్లం .. మాట ఒకటే సాగదీస్తాం .. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం' అంటూ విష్వక్ చెప్పిన డైలాగ్ తో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. లవ్ .. యాక్షన్ .. సస్పెన్స్ ప్రధానంగా ఈ గ్లింప్స్ కనిపించింది.
ఇంతవరకూ బాడీ లాంగ్వేజ్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా మాత్రమే మాస్ గా కనిపించిన విష్వక్, ఈ సినిమాలో మాస్ లుక్ తోనే కనిపిస్తున్నాడు. కథానాయికగా నేహా శెట్టి నటించిన ఈ సినిమాలో, ఇతర ముఖ్యమైన పాత్రలలో నాజర్ .. సాయికుమార్ .. గోపరాజు రమణ కనిపించారు. అంజలి ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించింది. నాగవంశీ - సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.