ఇప్పుడు యుద్ధం రష్యాపై మొదలయింది: మాస్కోపై దాడి తర్వాత జెలెన్ స్కీ

  • మాస్కోపై మూడు డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్
  • రష్యా భూభాగం వైపు యుద్ధం వెళ్తోందన్న జెలెన్ స్కీ
  • ఇది ఒక న్యాయమైన ప్రక్రియ అని వ్యాఖ్య
రష్యా చేస్తున్న యుద్ధంలో శ్మశానంలా మారిపోయిన ఉక్రెయిన్... ఇప్పుడు ఆ దేశంపై ఎదురు దాడికి దిగింది. రివర్స్ అటాకింగ్ మొదలు పెట్టింది. రష్యా రాజధాని మాస్కోపై మూడు డ్రోన్లతో దాడి చేసింది. మాస్కోకు దాదాపు 500 కిలోమీటర్ల దూరం నుంచి ఈ డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్లను రష్యా కూల్చినప్పటికీ... రెండు బిల్డింగులు మాత్రం దెబ్బతిన్నాయి. ఈ దాడులతో అప్రమత్తమైన రష్యా... మాస్కోలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. 

మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యుద్ధం రష్యా వైపు వెళ్తోందని ఆయన అన్నారు. క్రమంగా యుద్ధం ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా భూభాగం వైపు వెళ్తోందని చెప్పారు. రష్యా సైనిక స్థావరాలు, చారిత్రక కేంద్రాల వైపు యుద్ధం మళ్లుతోందని అన్నారు. ఇది ఒక న్యాయమైన ప్రక్రియ, పరిణామమని తెలిపారు. క్రమంగా ఉక్రెయిన్ బలపడుతోందని చెప్పారు. గత ఏడాది జరిగిన మాదిరే రష్యా టెర్రరిస్టులు తమ ఎనర్జీ సెక్టార్, కీలకమైన విభాగాలపై శీతాకాలంలో మళ్లీ దాడి చేసే అవకాశం ఉందనే విషయం తమకు తెలుసని... ఈసారి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు.


More Telugu News