నేడు కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం!

  • మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ
  • 40 నుంచి 50 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోనున్న మంత్రివర్గం
  • నిరుద్యోగభృతి వంటి అంశాలపై చర్చించే అవకాశం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఈ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల విస్తరణ, పెండింగ్ పనులు పూర్తి చేయడం వంటి వాటిపై చర్చించనున్నారు. గత ఎన్నికల సమయంలో నిరుద్యోగభృతి వంటి హామీలను కేసీఆర్ ఇచ్చారు. ఈనాటి సమావేశంలో వీటిపై చర్చించనున్నారు. 

వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే కొత్త హామీలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. గృహలక్ష్మి, రెండో విడత దళితబంధు, బీసీలు, మైనార్టీలకు రూ. లక్ష ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, పంట రుణాల మాఫీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.


More Telugu News