చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన రూట్ మ్యాప్ ఖరారు

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జల ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు నిర్ణయం
  • తొలి విడతలో రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన
  • ఆగస్టు 1 నుంచి 4 వరకు రాయలసీమలో వివిధ ప్రాజెక్టుల పరిశీలన
  • పులివెందులతో రోడ్ షో, సభ
  • కియా కార్ల పరిశ్రమను కూడా సందర్శించనున్న చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జల ప్రాజెక్టులను పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన రూట్ మ్యాప్ ఖరారైంది. 

ఆగస్టు 1న నందికొట్కూరులో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించనున్నారు. 

ఆగస్టు 2న కొండాపురం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అదే రోజున పులివెందులలో చంద్రబాబు రోడ్ షో, పూల అంగళ్ల సర్కిల్ లో సభ నిర్వహించనున్నారు. 

ఆగస్టు 3న పేరూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అదే రోజున గొల్లపల్లి రిజర్వాయర్ ను కూడా సందర్శించనున్నారు. అనంతరం కియా కార్ల పరిశ్రమను సందర్శించనున్నారు. 

ఆగస్టు 4న పలమనేరు బ్రాంచ్ కెనాల్ ను పరిశీలిస్తారు. అదే రోజున పూతలపట్టులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. 

చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనలో మొదటి రోజు కర్నూలు, రెండో రోజు కడప, మూడో రోజు అనంతపురం, నాలుగో రోజు చిత్తూరు జిల్లాలలో పర్యటన సాగనుంది. అనంతరం ఎటువంటి విరామం లేకుండా మిగిలిన జిల్లాలలోని సాగునీటి ప్రాజెక్టుల వద్దకు వెళ్లనున్నారు.


More Telugu News