శంకర్ కెరీర్ కు 30 ఏళ్లు... సంబరాలు చేసిన ఇండియన్-2, గేమ్ చేంజర్ యూనిట్ సభ్యులు

  • ప్రస్తుతం ఇండియన్-2, గేమ్ చేంజర్ సినిమాలకు శంకర్ దర్శకత్వం
  • శంకర్ కు శుభాకాంక్షలు తెలిపిన రెండు సినిమాల యూనిట్ల సభ్యులు
  • కేక్ కట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్న శంకర్
నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి, దర్శకత్వంలో తారాపథానికి ఎగసిన దక్షిణాది సూపర్ డైరెక్టర్ శంకర్ కెరీర్ కు 30 ఏళ్లు పూర్తయ్యాయి. 59 ఏళ్ల శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్-2, రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. 

ఆయన కెరీర్ 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇండియన్-2, గేమ్ చేంజర్ చిత్రాల యూనిట్ సభ్యులు సంయుక్తంగా వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో దర్శకుడు శంకర్ పాల్గొని కేక్ కట్ చేసి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ కు రెండు సినిమాల యూనిట్ల సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని హిట్ సినిమాలతో కెరీర్ కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

శంకర్... వాస్తవానికి ఇండస్ట్రీకి వచ్చింది నటుడు అవ్వాలని. 80వ దశకంలో వసంతరాగం, సీత సినిమాలతో నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన శంకర్... భారత చిత్ర పరిశ్రమ గర్వించే గొప్ప దర్శకుడు అవుతాడని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆయన జెంటిల్మన్ తో మొదలుపెట్టి ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో, రోబో 2.0 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దర్శకుల్లో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు.


More Telugu News