ముగిసిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికల పోలింగ్... ఫలితాలపై ఉత్కంఠ
- నేడు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికల పోలింగ్
- దిల్ రాజు ప్యానెల్ వర్సెస్ సి.కల్యాణ్ ప్యానెల్
- ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభం
- మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసిన పోలింగ్
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తున్న అంశం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికల పోలింగ్ నేడు హైదరాబాద్ లో జరిగింది.
ఈ ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మరో నిర్మాత సి.కల్యాణ్ ప్రత్యర్థులుగా ఈ ఎన్నికల బరిలో దిగడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం ఓట్లు 1567 కాగా... నిర్మాతల విభాగం నుంచి 891 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ విభాగం నుంచి 380 ఓట్లు, స్టూడియోల విభాగం నుంచి 68 ఓట్లు పోలయ్యాయి.
మొదట స్టూడియో రంగం ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ రంగం ఓట్లు, చివరగా నిర్మాతల ఓట్లు లెక్కించనున్నారు.