సోనూ సూద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు

  • నేడు సోనూ సూద్ పుట్టినరోజు
  • అసలుసిసలైన ఆపద్బాంధవుడు అంటూ కొనియాడిన చంద్రబాబు
  • అవధుల్లేని విజయాలు  అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్
ప్రముఖ నటుడు, దాత సోనూ సూద్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సోనూ సూద్ అసలుసిసలైన ఆపద్బాంధవుడు అంటూ కొనియాడారు. దయ, ఉదార స్వభావంతో ప్రభావితం చేయడమే కాకుండా, లెక్కలేనంత మంది జీవితాలను మార్చివేశాడని చంద్రబాబు కీర్తించారు. 

"జీవన సాఫల్యం దిశగా మీకు అత్యద్భుతమైన ఆరోగ్యం సమకూరాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు తలపెట్టే పనుల్లో హద్దుల్లేని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు కోసం మీ నిరంతర ప్రయత్నాలు ఇకపైనా కొనసాగాలి" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


More Telugu News