శాంతి చర్చలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు!

  • శాంతి చర్చల ఆలోచనను తాను తిరస్కరించడం లేదన్న పుతిన్
  • ఇందుకు రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని వ్యాఖ్య
  • ఉక్రెయిన్ దాడులు చేస్తుంటే కాల్పుల విరమణ ఎలా సాధ్యమని ప్రశ్న
ఉక్రెయిన్‌ విషయంలో శాంతి చర్చలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల ఆలోచనను తాను తిరస్కరించడం లేదని చెప్పారు. అయితే ఈ ప్రక్రియ జరపాలంటే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆఫ్రికా నేతలతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. ఆఫ్రికా, చైనా చేపడుతున్న కార్యక్రమాలు శాంతిని నెలకొల్పడానికి ఓ ప్రాతిపదికగా ఉపయోగపడతాయని అన్నారు. 

కాల్పుల విరమణ అంశంపై పుతిన్ స్పందిస్తూ... ‘‘ఉక్రెయిన్ ఆర్మీ దూకుడుగా ఉంది. వాళ్లు దాడులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వ్యూహాత్మక ఆపరేషన్‌ను చేపడుతున్నారు. మేం దాడికి గురయ్యాం. అలాంటప్పుడు కాల్పుల విరమణను అమలు చేయడం సాధ్యం కాదు” అని చెప్పారు. శాంతి చర్చలు జరిపే అంశంపై మాట్లాడుతూ... ‘‘మేం తిరస్కరించడం లేదు. ఈ ప్రక్రియ ప్రారంభించాలంటే... ఏకాభిప్రాయం అవసరం” అని చెప్పుకొచ్చారు.


More Telugu News