డబ్బు, అహంకారం: టీమిండియా ఆటగాళ్లపై కపిల్ దేవ్ ఫైర్

  • తమకు అన్నీ తెలుసని ఇప్పటి ఆటగాళ్లు అనుకుంటుంటారని కపిల్ విమర్శ
  • ఇతరుల నుంచి నేర్చుకుందామనే ఆలోచన లేదని వ్యాఖ్య
  • గవాస్కర్ తో మాట్లాడేందుకు కూడా నామోషీ ఎందుకని ప్రశ్న
టీమిండియా క్రికెటర్లపై క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటుంటారని చెప్పారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచి విషయమేనని... అయితే ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం నెగెటివ్ పాయింట్ అని అన్నారు. చాలా మంది క్రికెటర్లకు సలహాలు, సూచనలు అవసరమని చెప్పారు. 

మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి, ఆయన నుంచి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల (సంవత్సరాలు) క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకని అడిగారు. తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని... వాస్తవానికి వారికి అంతా తెలియదని చెప్పారు. ఇప్పటి ఆటగాళ్లకి డబ్బుతో పాటు అహంకారం కూడా ఎక్కువని విమర్శించారు.


More Telugu News