వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా
- విండీస్ టూర్ లో ఇండియాకు తొలి ఎదురుదెబ్బ
- రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచిన విండీస్
- 181 పరుగులకే ఆలౌట్ అయిన భారత్
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు తొలిసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బార్బడోస్ లో జరిగిన రెండో వన్డేలో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఇండియాపై విండీస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్ ను వెస్టిండీస్ 1-1తో సమం చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియన్ బ్యాట్స్ మెన్లలో కేవలం ఇషాన్ కిషన్ (55 పరుగులు), శుభ్ మన్ గిల్ (34) మాత్రమే రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాట్స్ మెన్లలో షై హోప్ (63), కార్టీ (48), కైల్ మేయర్స్ (36) రాణించారు. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. సిరీస్ ను నిర్ణయించే తుది వన్డే ఆగస్టు 1న జరగనుంది.