రోహిత్, కోహ్లీ లేకుండానే రెండో వన్డే బరిలోకి భారత్
- టీమిండియా-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్
- తొలి వన్డే నెగ్గిన భారత్
- నేడు బ్రిడ్జ్ టౌన్ కెన్సింగ్ టన్ ఓవల్ లో రెండో వన్డే
- టీమిండియాకు మొదట బ్యాటింగ్
తొలి వన్డే నెగ్గి మాంచి ఊపుమీదున్న టీమిండియా నేడు వెస్టిండీస్ తో రెండో వన్డేలో తలపడుతోంది. తొలి మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన బ్రిడ్జ్ టౌన్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ మైదానమే నేటి మ్యాచ్ కు కూడా వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన వెస్టిండీస్... భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసి ఓటమిపాలైన నేపథ్యంలో ఆతిథ్య విండీస్ ఛేజింగ్ కు మొగ్గు చూపినట్టు అర్థమవుతోంది.
కాగా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో పలు మార్పులు జరిగాయి. ఈ మ్యాచ్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి కల్పించారు. వారి స్థానంలో సంజు శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
ఇక, విండీస్ జట్టులో పావెల్, డ్రేక్స్ కు ఉద్వాసన పలికారు. అల్జారీ జోసెఫ్, కీసీ కార్టీలకు జట్టులో చోటు కల్పించారు.