భారత్ లో వన్డే వరల్డ్ కప్... టికెట్ల విక్రయాలకు ముహూర్తం ఖరారు!
- నాలుగేళ్లకోసారి వన్డే వరల్డ్ కప్
- ఈసారి మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్
- అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వరల్డ్ కప్
- ఆగస్టు 10 నుంచి టికెట్ల విక్రయాలు
నాలుగేళ్లకోసారి జరిగే వన్డే వరల్డ్ కప్ కు ఈసారి భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 5న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ నవంబరు 19న ముగియనుంది. అయితే, ఈ మెగా ఈవెంట్ కు టికెట్ల అమ్మకాలపై బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 10 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ ల టికెట్ల విక్రయాలు జరపాలని బోర్డు భావిస్తోంది.
బీసీసీఐ కార్యదర్శి జై షా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరిగే రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో సమావేశం జరిపారు. ఈసారి ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు జరపరాదని ఈ సమావేశంలో నిర్ణయించారు. అభిమానులు తప్పనిసరిగా టికెట్ కౌంటర్లకు వచ్చి టికెట్లు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. అందుకోసం ఏడెనిమిది వికెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే టికెట్ల ధరలపై ప్రకటన ఉంటుందని షా వెల్లడించారు.