మార్ఫింగ్ ఫొటోలతో యువతికి లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు

  • నెల్లూరు జిల్లాలో ఘటన
  • క్యాండీ కాష్, ఈజీ మనీ యాప్ ల నుంచి రుణం తీసుకున్న యువతి
  • మూడ్రోజుల్లోనే తిరిగి చెల్లించిన వైనం
  • ఇంకా చెల్లించాలంటూ లోన్ యాప్ ల బెదిరింపులు
  • దిశ పోలీసులను ఆశ్రయించిన యువతి
  • కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
గత కొన్నాళ్లుగా లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, నెల్లూరు జిల్లాలో మార్ఫింగ్ ఫొటోలతో ఓ యువతికి లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. 

క్యాండీ కాష్, ఈజీ మనీ యాప్ ల నుంచి ఆ యువతి రూ.3,700 రుణం తీసుకుంది. అయితే ఆ రుణాన్ని యువతి మూడ్రోజుల్లోనే చెల్లించింది. అయినప్పటికీ ఇంకా చెల్లించాలని లోన్ యాప్ ల నిర్వాహకుల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. మార్ఫింగ్ ఫొటోలతో బెదిరించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో, వేధింపులు తీవ్రం కావడంతో ఆ యువతి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దీనిపై కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల పట్ల ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని దిశ పోలీసులు బాధిత యువతికి భరోసానిచ్చారు.


More Telugu News