జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారు: పురందేశ్వరి వ్యాఖ్యలపై బొత్స రియాక్షన్
- ఏపీ అప్పులపై వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పురందేశ్వరి
- జగన్ చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించిన బొత్స
- బీజేపీ పాలిత రాష్ట్రాలకు అప్పుల్లేవా అని నిలదీసిన వైనం
ఏపీ బీజేపీ పగ్గాలు అందుకున్న దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందంటూ పురందేశ్వరి చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
ఏపీలో జగన్ పాలన చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం పురందేశ్వరికి కనిపించడంలేదా... అవన్నీ వదిలేసి ఏపీ అప్పుల్లో ఉందని వ్యాఖ్యానించడం సమంజసమేనా? అని బొత్స ప్రశ్నించారు.
ఓ బీజేపీ ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతూ, అప్పుల్లో ఏపీ ఏడో స్థానంలో ఉందని చెబుతున్నాడు... మరి మిగిలిన ఆరు రాష్ట్రాల గురించి మీరు ఎందుకు మాట్లాడడంలేదు? బీజేపీ పాలిత రాష్ట్రాల అప్పుల గురించి ఎందుకు మాట్లాడరు? అంటూ బొత్స నిలదీశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి ఒక్క మాట మాట్లాడకుండా, ఇలా అప్పుల గురించి మాట్లాడడం సరికాదు అంటూ వ్యాఖ్యానించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.