టీడీపీ, జనసేన అధికారంలోకి రావని వాళ్లకూ తెలుసు: ప్రసన్నకుమార్ రెడ్డి
- చంద్రబాబు, పవన్ ముఖ్యమంత్రులు కాలేరన్న ప్రసన్నకుమార్ రెడ్డి
- వారికి మతిభ్రమించి ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం
- మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన అధికారంలోకి రావని వాళ్లకూ తెలుసని, వాళ్లు ముఖ్యమంత్రులు అయ్యేదే లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి మతిభ్రమించి ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.