బాణసంచా గోడౌన్ లో భారీ పేలుడు.. తమిళనాడులో నలుగురి మృతి.. వీడియో ఇదిగో!
- మరో 20 మందికి పైగా గాయాలు
- పేలుడు ధాటికి కూలిన చుట్టుపక్కల ఇళ్లు
- వాటి శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు అనుమానాలు
తమిళనాడులోని బాణసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గోడౌన్ బిల్డింగ్ సహా చుట్టుపక్కల మరో ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ దుర్ఘటనలో గోడౌన్ సిబ్బంది నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు.
కృష్ణగిరి పాతపేటలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీ గోడౌన్ లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ కు నిప్పంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో నలుగురు చనిపోగా మరో 20 మంది గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించామని, బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.