నా కెరీర్ ఇలా ఉండడానికి కారణం వాళ్లే: రజనీకాంత్
- రజనీ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో జైలర్
- చెన్నైలో వేడుకగా ఆడియో రిలీజ్ ఫంక్షన్
- హాజరైన రజనీకాంత్
- తన కెరీర్ ఎదుగుదలకు దర్శకులు ప్రధాన కారణం అని వెల్లడి
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది. ఈ ఫంక్షన్ కు హాజరైన రజనీకాంత్ ప్రసంగించారు.
తన కెరీర్ ఎదుగుదలలో దర్శకుల పాత్ర ఎంతో ఉందని, వాళ్ల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని వినమ్రంగా తెలిపారు. తాము సృష్టించిన కథల్లో తనను హీరోగా పెట్టి, సినిమాలు చేసి తనకు గుర్తింపు అందించారని వివరించారు. ఇప్పుడా దర్శకుల జాబితాలో నెల్సన్ దిలీప్ కుమార్ కూడా చేరారని చెప్పారు.
ఓ సినిమా బిడ్డ లాంటిది అనుకుంటే, ఆ బిడ్డకు నిర్మాత అమ్మలాంటివాడని, దర్శకుడు తండ్రిలాంటివాడని రజనీ వివరించారు.
ఇక, అన్నాత్తే చిత్రం తర్వాత చాలా టైమ్ తీసుకుని జైలర్ లో నటించానని, మంచి కథ దొరక్కపోవడమే అందుకు కారణమని తెలిపారు. జైలర్ చిత్రంలో రజనీ సరసన తమన్నా కథానాయిక కాగా... రమ్యకృష్ణ, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, సునీల్ తదితరులు కీలకపాత్ర పోషించారు.