హైదరాబాద్‌లో భారీ వర్షం, వరదల్లో చలాన్ వేసినట్టు ఫొటో వైరల్ ... క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్
- నిన్నటి వరకు భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం
- అలాంటి సమయంలోను పోలీసులు చలాన్ కోసం ఫోటోలు తీశారంటూ ఆరోపణలు
- అలాంటిదేమీ లేదని స్పష్టతనిచ్చిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్
ఇటీవలి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని పౌరులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాని పరిస్థితులు! నగరంలోని చాలా వరకు రోడ్లు నీట మునిగి, చెరువులను తలపించాయి. కార్యాలయాలకు, అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లినవారు నీటి మడుగులను తలపించే రోడ్లపై ప్రయాణించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోను ట్రాఫిక్ పోలీసులు చలాన్ల కోసం ఫోటోలు తీశారంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయింది.
దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఫోటోపై స్పందిస్తూ... అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చలాన్ వేయలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆ ఫోటో ఎక్కడ.. ఎందుకు తీశారో కూడా వెల్లడించారు. అయోధ్య క్రాస్ రోడ్డులో వాటర్ లాగింగ్ అయితే తొలగింపు చర్యల కోసం మాత్రమే పోలీసులు వీడియో తీసినట్లు తెలిపారు.