బూతులుంటేనే ఆడియన్స్ చూస్తారనుకోవడం అవివేకం: జేడీ చక్రవర్తి
- జేడీ చేసిన వెబ్ సిరీస్ గా 'దయా'
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- వచ్చేనెల 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో
- కంటెంట్ బాగుంటేనే చూస్తారన్న జేడీ
జేడీ చక్రవర్తి తన కెరియర్లో చేసిన ఫస్టు వెబ్ సిరీస్ గా 'దయా' నిలవనుంది. 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో వచ్చేనెల 4వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దాంతో 'దయా' ప్రమోషన్స్ లో జేడీ బిజీగా ఉన్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "పవన్ సాధినేని కథ చెప్పిన తీరును నచ్చడం వలన ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నాను" అని అన్నాడు.
"పవన్ సాధినేని నాకు కథ చెప్పినప్పుడు బాగుందనిపించింది .. ఆయన టేకింగ్ చూస్తున్నప్పుడు ఇంకా బాగుందనిపించింది. ఈ కథను ఇలా కూడా తీయవచ్చునా? అని డబ్బింగ్ చెబుతున్నప్పుడు అనిపించింది. అలా ఈ ప్రాజెక్టుపై నా అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుతూ వెళ్లాడు. ఈ కథ ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తూ వెళుతూ ఉంటుంది" అని చెప్పాడు.
ఇక ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లలో .. సినిమాలలో ఒక బూతు మాటను చాలా తేలికగా వాడేస్తున్నారు. బూతు డైలాగ్స్ ఎక్కువగా ఉంటే .. అమ్మాయిలు బట్టలు తక్కువ వేసుకుంటే ఎక్కువమంది చూస్తారనుకోవడం అవివేకం. వెబ్ సిరీస్ అయినా .. సినిమానైనా సక్సెస్ కావాలంటే బలమైన కంటెంట్ కావలసిందే" అంటూ చెప్పుకొచ్చాడు.