పూజా హెగ్డే ఆత్మహత్యాయత్నం చేసిందన్న సినీ విమర్శకుడు... లీగల్ నోటీసుల జారీ

  • వివాదాస్పద క్రిటిక్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉమైర్ సంధూ
  • తనను తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా పరిచయం
  • పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నిస్తే కుటుంబ సభ్యులు కాపాడారని వెల్లడి
  • పూజా నుంచి తనకు లీగల్ నోటీసులు వచ్చాయని వివరణ
తనను తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధూ... కొత్త సినిమాలపై రివ్యూలు, సినీ తారల గురించి బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ వివాదాస్పదమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇటీవల ఉమైర్ సంధూ అందాలభామ పూజా హెగ్డే ఆత్మహత్యాయత్నం చేసిందంటూ సంచలనం సృష్టించాడు. 

అయితే, ఆమెను కుటుంబ సభ్యులు కాపాడారని తెలిపాడు. పూజా హెగ్డే గత రెండు వారాలుగా డిప్రెషన్ లో ఉన్నట్టు ఆమె సోదరుడు చెప్పాడని ఉమైర్ సంధూ వెల్లడించాడు. 

అయితే, సంధూ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న పూజా హెగ్డే టీమ్ అతడికి లీగల్ నోటీసులు పంపింది. తనకు పూజా హెగ్డే నుంచి లీగల్ నోటీసులు అందిన విషయాన్ని కూడా ఉమైర్ సంధూనే ట్విట్టర్ లో వెల్లడించాడు.


More Telugu News