డియర్ ప్రసాద్స్.. నువ్వు నా క్లాస్‌రూమ్: రాజమౌళి
- 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రసాద్స్ మల్టీప్లెక్స్
- దానితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న దర్శకధీరుడు
- ప్రత్యేక వీడియోను షేర్ చేసిన రాజమౌళి
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ నిర్మించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ థియేటర్‌తో ఉన్న జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
‘ఎన్ని శుక్రవారాలు. ఎన్ని ఫస్ట్ డే ఫస్ట్ షోలు, 8.45 షోకి సీట్లో ఉండాలనే ఆత్రుత. అప్పుడే 20 ఏళ్లు గడిచాయా? సినిమా బాగా ఆడినా ఆడకపోయినా ఇక్కడ చూసిన ప్రతి సినిమా నాకు పాఠం నేర్పింది. డియర్ ప్రసాద్స్.. నువ్వు సినిమా మాత్రమే కాదు.. నువ్వు నా క్లాస్‌రూమ్. థ్యాంక్యూ’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రసాద్స్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆయన షేర్ చేశారు.