వరదలో గంటల పాటు చెట్టుపై ఉండి ప్రాణాలు దక్కించుకున్న ఖమ్మం వాసి

  • చీరలతో తాడు అల్లి రక్షించిన స్థానికులు
  • రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
  • వరదలతో పలు ప్రాంతాలు జలమయం
భారీ వర్షాలతో తెలంగాణలోని చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాంతాలు నీట మునగగా, ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కొంతమంది వరదలో గల్లంతయ్యారు. 

ఈ క్జిరమంలో ల్లాలోని జలగామ నగర్‌లో నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఓ వ్యక్తి చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. మూడు గంటల పాటు చెట్టుపైనే ఉన్న ఆ వ్యక్తిని స్థానికులు చీరలతో తయారు చేసిన తాడును ఉపయోగించి రక్షించారు. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలు ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్ల డాబాలపైకి ఎక్కాయి. కాగా, రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నిన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో 64.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


More Telugu News