కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తు.. నకిలీ నోటు అనే ప్రచారంపై ఆర్బీఐ క్లారిటీ

  • ఇతర నోట్లతో సమానంగా చట్టబద్ధమైనవేనని వెల్లడి
  • ప్రీఫిక్స్, సీరియల్ నెంబర్ మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుందని తెలిపిన ఆర్బీఐ
  • 2016లోను రూ.500 నోట్లపై ఈ స్టార్ సింబల్ ఉందన్న కేంద్ర బ్యాంకు
కరెన్సీ నోట్లపై స్టార్ (*) గుర్తుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇవి నకిలీ నోట్లుగా వస్తున్న అనుమానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టతనిచ్చింది. కరెన్సీ నోట్లపై స్టార్ (*) గుర్తు ఉన్న నోట్లు కూడా ఇతర నోట్లతో సమానంగా అవి చట్టబద్ధమైనవేనని పేర్కొంది. 

సాధారణంగా కరెన్సీ నోట్లపై సీరియల్ నెంబర్ ను ముద్రిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల కొన్ని నోట్లపై ఈ సింబల్ ను ముద్రించినట్లు తెలిపింది. ప్రీఫిక్స్, సీరియల్ నెంబర్ మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుందని తెలిపింది.

స్టార్ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు నకిలీవేమో అనే చర్చ ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. స్టార్ సింబల్ గుర్తు అంటే దానిని రీప్లేస్ చేసిన, పునర్ ముద్రించిన నోట్లు అని ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. వాటిని సులువుగా గుర్తించడానికి ఈ స్టార్ సింబల్ ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. 2016లో ఆర్బీఐ జారీ చేసిన 500 నోట్లపై కూడా స్టార్ సింబల్ ఉందని గుర్తు చేసింది.


More Telugu News