భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఈరోజున ముగిసిన జులై నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టులు
- అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీలు
- 440 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ రిజర్వ్ పెంచడంతో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. లాభాల్లోకి వెళ్లాయి. అయితే ఆ తర్వాత మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. జులై సిరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల గడువు ఈరోజున ముగియనుండటంతో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు కోల్పోయి 66,266కి పడిపోయింది. నిఫ్టీ 118 పాయింట్లు పతనమై 19,659కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.10%), టాటా మోటార్స్ (0.83%), భారతి ఎయిర్ టెల్ (0.69%), ఎల్ అండ్ టీ (0.62%), ఇన్ఫోసిస్ (0.30%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-6.39%), టెక్ మహీంద్రా (-3.82%), నెస్లే ఇండియా (-2.08%), బజాజ్ ఫైనాన్స్ (-1.98%), యాక్సిస్ బ్యాంక్ (-1.75%).