విండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో వైదొలిగిన సిరాజ్
- ఈ రోజు భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే
- చీలమండ నొప్పితో బాధపడుతున్న సిరాజ్
- సిరీస్ నుంచి తప్పించిన బీసీసీఐ
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ గెలిచి జోరు మీదున్న భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. అయితే, ఈ సిరీస్ కు ముందు రోహిత్‌సేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా అతడు ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్ తర్వాత చీలమండలో నొప్పి వచ్చినట్టు సిరాజ్ తెలిపాడు. దాంతో ఈ సిరీస్ నుంచి బీసీసీఐ అతడిని రిలీజ్ చేసింది.
సిరాజ్‌ను పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం ముందు జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దాంతో, ఈ సిరీస్ నుంచి అతను తప్పుకోవాల్సి వచ్చింది. విండీస్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. బుమ్రా, షమీ అందుబాటులో లేకపోవడంతో భారత పేస్ బృందాన్ని సిరాజ్ నడిపిస్తున్నాడు. అతను దూరం కావడం వన్డే సిరీస్‌లో భారత్‌కు కచ్చితంగా లోటు కానుంది.