ఏపీలో వేలాది మంది మహిళలు అదృశ్యమవుతుండటం వెనకున్న శక్తులు ఎవరు?: సాధినేని యామిని
- ఏపీలో మహిళల భద్రత ప్రమాదకరంగా ఉందన్న యామిని
- స్త్రీల రక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపాటు
- ఏపీ మహిళా కమిషన్ విఫలమయిందని విమర్శ
ఏపీలో వేలాది మంది మహిళలు అదృశ్యం కావడం ఆందోళన కలిగించే విషయమని బీజేపీ మహిళా మోర్చా ఏపీ మీడియా కన్వీనర్ సాధినేని యామినీ శర్మ అన్నారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలను చూస్తే... ఏపీలో మహిళల భద్రత ప్రమాదకరంగా ఉందనే విషయం అర్థమవుతుందని చెప్పారు.
మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం తప్ప... స్త్రీల రక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు తప్పిపోతున్నారా? లేక ఎవరైనా తప్పిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. మహిళల అదృశ్యం వెనకున్న శక్తులు ఎవరని ప్రశ్నించారు. తప్పిపోతున్న మహిళలందరూ ఏమవుతున్నారని నిలదీశారు. విపక్ష నేతలకు నోటీసులు పంపించడానికి ఉత్సాహం చూపించే ఏపీ మహిళా కమిషన్... మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయిందని దుయ్యబట్టారు.