'పెదకాపు' నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ రిలీజ్!
- శ్రీకాంత్ అడ్డాల నుంచి 'పెదకాపు'
- గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
- పొలిటికల్ టచ్ తో సాగే ప్రేమకథ
- మిక్కీ జె మేయర్ పాటలకి మంచి రెస్పాన్స్
శ్రీకాంత్ అడ్డాలకి ఆయన కెరియర్ తొలినాళ్లలో పేరు తీసుకొచ్చినవి ప్రేమకథా చిత్రాలే. ఇక గ్రామీణ నేపథ్యంలో ఆయన యాక్షన్ ను .. ఎమోషన్ ను ఎంత సహజంగా ఆవిష్కరించగలడనేది 'నారప్ప' సినిమా నిరూపించింది. అలాంటి ఒక కథకు పొలిటికల్ టచ్ చేస్తూ ఆయన రూపొందించిన సినిమానే 'పెదకాపు'. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.
విరాట్ కర్ణ - ప్రగతి శ్రీవాత్సవ జంటగా నటించిన ఈ సినిమా నుంచి, 'చనువుగా చూసిన' అనే పూర్తి పాటను రిలీజ్ చేశారు. 'అరెరే తనవాటమే .. అసలే పడదే మొహమాటమే, చనువుగా చూసినా .. చూపులతో తినేసినా .. ఆకలి తీరునా .. అరిగేనా' అంటూ ఈ పాట సాగుతోంది. మిక్కీజే మేయర్ అందించిన బ్యూటిఫుల్ మెలోడీ ఇది.
కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, అనురాగ్ కులకర్ణి - చిత్ర అంబడిపూడి ఆలపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగిన చిత్రీకరణ ఆకట్టుకునేలా ఉంది. ఫొటోగ్రఫీ పరంగా కూడా ఈ పాటకి ఎక్కువ మార్కులు దక్కుతాయి. ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల మళ్లీ బిజీ అవుతాడేమో చూడాలి.