4 డిగ్రీల చలిలో 6 నిమిషాల పాటు ఐస్ బాత్ చేసిన సమంత

  • విదేశాలకు వెకేషన్ కు వెళ్లిన సమంత
  • బాలీలో స్నేహితులతో కలసి ఎంజాయ్ చేస్తున్న సామ్
  • బీచ్ వీడియోను ఇటీవల షేర్ చేసిన ముద్దుగుమ్మ 
సినిమా షూటింగ్ లకు ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న సమంత ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి విదేశాలకు వెకేషన్ కు వెళ్లింది. బాలీలో ఎంజాయ్ చేస్తోంది. బాలీ బీచ్ లో దిగిన వీడియోను, ఫొటోలను రెండ్రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తను నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్ బాత్ చేసినట్టు సమంత తెలిపింది. దీన్ని చూసిన అభిమానులు వావ్ అంటున్నారు. మరోవైపు, ఐస్ థెరపీ మయోసైటిస్ చికిత్సలో ఓ భాగమా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా సమంత ఐస్ గడ్డలు ఉన్న టబ్ పై కూర్చొన్న ఫొటోలను షేర్ చేసింది. 

మరోవైపు సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఖుషి' సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది. అలాగే బాలీవుడ్ లో సమంత నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News