కేటీఆర్ కు ఐఎస్బీ మొహాలీ నుంచి ఆహ్వానం

  • అడ్వాన్స్ డ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ 8వ బ్యాచ్ ను ప్రారంభించాలని ఆహ్వానం
  • వచ్చే నెల 11న జరిగే కార్యక్రమానికి రావాలని ఇన్విటేషన్
  • ఐఎస్బీకి మీ మద్దతు, సహకారం మున్ముందు కూడా ఇదేలా కొనసాగాలని విజ్ఞప్తి 
పంజాబ్ లోని మొహాలీలో ఉన్న ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. వచ్చే నెల 11న తమ క్యాంపస్ లో అడ్వాన్స్ డ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ 8వ బ్యాచ్ ను ప్రారంభించి, ప్రసంగించాలని కేటీఆర్ ను ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల ఆహ్వానించారు. 

ఐఎస్బీకి మీరు బలమైన మద్దతుదారులుగా ఉన్నారని... మీ మద్దతు, సహకారం మున్ముందు కూడా ఇదేలా కొనసాగాలని తమ ఆహ్వానపత్రంలో మదన్ పిల్లుట్ల పేర్కొన్నారు. మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీలో వివిధ అంశాలు, దాని రూపకల్పన ప్రక్రియను అర్థం చేసుకునేందుకు మీ అనుభవం, సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ అనేది పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లోని మిడ్ కెరీర్ నిపుణుల కోసం రూపొందించినది.


More Telugu News