ప్రతికూల వాతావరణం నేపథ్యంలో.. శంషాబాద్‌లో ఖతార్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దోహా నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న విమానం
- నాగ్‌పూర్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని వాతావరణం
- విమానంలో 160మంది ప్రయాణికులు
దుబాయ్‌లోని దోహా నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగ్‌పూర్‌లోనూ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు.
విమానం ల్యాండింగ్‌కు అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించి, శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అందులోని 160 మంది ప్రయాణికులను నోవాటెల్‌కు తరలించారు. వాతావరణం అనుకూలించి, విమానానికి అనుమతులు వచ్చిన తర్వాత విమానం తిరిగి నాగ్‌పూర్ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.