ప్రేమజంటకు శ్మశానంలో అంగరంగవైభవంగా పెళ్లి
- మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని రహతా గ్రామంలో ఘటన
- స్థానిక శ్మశానంలో కాటికాపరిగా పనిచేస్తున్న గంగాధర్
- అక్కడే పుట్టి పెరిగిన గంగాధర్ కుమార్తె మయూరి
- శిర్డీకి చెందిన యువకుడితో మయూరి ప్రేమ, పెద్దల అంగీకారం
- మయూరి పుట్టిపెరిగిన చోటే పెళ్లిచేయాలన్న తండ్రి కోరిక మేరకు శ్మశానంలో వివాహం
మహారాష్ట్రలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. శ్మశానంలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. అహ్మద్‌నగర్ జిల్లా శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ స్థానిక శ్మశానంలో కాటికాపరిగా పనిచేస్తున్నారు. ఆయనది మహాసంజోగీ సామాజిక వర్గం. కొన్నేళ్లుగా ఆయన తన కుటుంబంతో కలిసి శ్మశానంలోనే ఉంటున్నారు.
గంగాధర్ కుమార్తె మయూరి శ్మశానంలోనే పుట్టి పెరిగింది. 12వ తరగతి వరకూ చదువుకుంది. అయితే, ఆమె శిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడిని ప్రేమించడంతో ఇరు కుటుంబాల వారు ఆ జంటకు ఇటీవల వివాహం జరిపించారు. మయూరి పుట్టి పెరిగినచోటే ఆమె పెళ్లి చేయాలని గంగాధర్ కోరడంతో ఆ జంట వివాహం శ్మశానంలో బంధువులు, స్నేహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.