టీ9-30 టిక్కెట్ తో 30 కి.మీ. ప్రయాణం.. టీఎస్ ఆర్టీసీ సరికొత్త పథకం
- రూ.50 ఛార్జీ చెల్లించి రాను, పోను ప్రయాణించవచ్చు
- ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు చెల్లుబాటు
- కాంబి టిక్కెట్ తో ఎక్స్‌ప్రస్‌లోనూ ప్రయాణించవచ్చు
తెలంగాణలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల కోసం సరికొత్త రాయితీ పథకాన్ని తీసుకు వచ్చింది. ఆర్టీసీ కొత్తగా టీ9-30 టిక్కెట్ ను ప్రవేశపెట్టింది. రూ.50 ఛార్జీతో పల్లె వెలుగులో టిక్కెట్ తీసుకొని 30 కిలో మీటర్లు రాను, పోను ప్రయాణించవచ్చు. ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఈ టీ9-30 టిక్కెట్ రేపటి నుండి అందుబాటులోకి వస్తోంది.
దీంతో ఒక్కొక్కరికి రూ.10 నుండి రూ.30 వరకు ఆదా అవుతుంది. పల్లె వెలుగు కోసం ఈ టిక్కెట్ తీసుకున్న వారికి ఎక్స్‌ప్రెస్ లోను ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే రూ.20 కాంబినేషన్ టిక్కెట్ తీసుకొని ఎక్స్‌ప్రెస్ బస్సులోను ప్రయాణించవచ్చు. ఈ టిక్కెట్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్లు 040-69440000 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ టిక్కెట్ పల్లెవెలుగులో ప్రయాణించే అందరికీ వర్తిస్తుంది.