మ్యూజికల్ రోడ్: కారు వెళ్తుంటే జానపద పాట వినిపించే రోడ్డు ఉందన్న విషయం తెలుసా?

  • హంగేరిలోని ఈశాన్య భాగంలో ఉన్న రోడ్డు
  • కారు గంటకు 80 కిలో మీటర్ల వేగంతో వెళ్తేనే సంగీతం
  • వేగం తగ్గినా.. పెరిగినా అసంబద్ధ మ్యూజిక్
సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ లేదా ఎక్స్ ‌లో ఓ మ్యూజిక్ రహదారి వైరల్ గా మారింది. ఈ రోడ్డుపై వాహనాలు నిర్దేశించిన వేగంతో వెళ్తే రోడ్డుపై సంగీతం వినిపిస్తుంది. ఈ మ్యూజిక్ రోడ్ హంగేరీలో ఉంది. దీనిని రోడ్ 37 అని పిలుస్తారు. ఈ రోడ్డు దేశంలోని ఈశాన్య భాగంలో ఉంది. హంగేరీ టుడే ప్రకారం స్లొవేకియా సరిహద్దులోని ఫెల్సోజ్సోల్కా నుండి సటోరల్జౌజెలీ వెళ్లే రోడ్డులో ఈ మ్యూజిక్ వినిపిస్తోంది. కారు నిర్దేశిత వేగంతో వెళ్తుంటే స్థానిక ఎరిక్ ఎ స్జోలో అనే జానపద పాట ఈ రోడ్డు నుండి వినిపిస్తుంది. 

అయితే ఈ రోడ్డుపై కచ్చితంగా నిర్దేశించిన వేగంతోనే వెళ్లాలి. రెండేళ్ల క్రితం రోడ్డును నిర్మించారు. అప్పట్లోనే ఈ వార్త వైరల్ గా మారింది. ఇప్పుడు మరోసారి పతాకశీర్షికలకు ఎక్కింది. ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుండి 15 మిలియన్ల కంటే ఎక్కువమంది చూడగా, లక్షన్నరకు పైగా లైక్స్ వచ్చాయి.

ఇక్కడి హైవేపై వేగ పరిమితి గంటకు 80 కిలో మీటర్లు. సరిగ్గా ఇదే వేగంతో వాహనం వెళ్తే రోడ్డు, టైర్ల మధ్య జరిగే ర్యాపిడితో ఈ సంగీతం వస్తుంది. డ్రైవర్ తన వాహనాన్ని కాస్త వేగం తగ్గించినా లేదా కాస్త వేగం పెంచినా ఈ రోడ్డుపై వచ్చే సంగీతం అసంపూర్ణంగా లేదా అసంబద్ధంగా వస్తుంది. మ్యూజిక్ రోడ్డు ప్రయోగాలను ఇతర దేశాలు కూడా చేశాయి. మొట్టమొదటి సంగీత రహదారిని డెన్మార్క్ లోని గిల్లింగ్ లో 1995లో నిర్మించారు. ఫ్రాన్స్‌లోని విల్ పింటే శివారులో 2000 సంవత్సరంలో మ్యూజిక్ రోడ్డును నిర్మించారు.


More Telugu News