కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై కిషన్ రెడ్డి స్పందన
- అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగేది ఏమీ లేదన్న కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ ఒకటేనని విమర్శ
- తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేని చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మూడు పార్టీలు పలుసార్లు తెలంగాణను పాలించాయని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ తో పోరాటం చేస్తుందని... బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ కుటుంబ పార్టీలే అని విమర్శించారు. తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని చెప్పారు.