మదనపల్లె మార్కెట్‌లో కిలో రూ.168కి పెరిగిన టమాటా ధర
- మదనపల్లె మార్కెట్ లో రికార్డ్ స్థాయికి టమాటా ధరలు
- ఏ గ్రేడ్ టమాటా ధర కిలో రూ.140 నుండి రూ.168కి పెరుగుదల
- బాక్స్ టమాటా ధర రూ.3,500 నుండి రూ.4,200కు జంప్
టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె మార్కెట్ లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఇక్కడి మార్కెట్ పరిధిలో బుధవారం రికార్డ్ స్థాయిలో కిలో నాణ్యమైన టమాటా ధర రూ.168 పలికింది. రైతులు 361 టన్నుల టమాటాలను మార్కెట్ కు తీసుకు వచ్చారు.
ఇక్కడ ఏ గ్రేడ్ టమాటా కిలో రూ.140 నుండి రూ.168, బీ గ్రేడ్ రూ.118 నుండి రూ.138 పలికాయి. సగటున కిలో రూ.132 నుండి రూ.156 వరకు పలికినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. నిన్న రూ.140 పలికిన నాణ్యమైన టమాటా ఇప్పుడు రూ.168కి చేరుకోవడం గమనార్హం.
ముప్పై కిలోల టమాటా బాక్స్ ధర ఇక్కడి మార్కెట్లో రూ.4200కు చేరుకుంది. వారం రోజుల క్రితం బాక్స్ ధర రూ.3,500 నుండి రూ.3,800 మధ్య ఉంది. టమాటా ధరలు భారీగా పెరగడంతో స్థానిక రైతులు ఆనందంగా ఉన్నారు. టమాటా సాగు తగ్గడం, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.