విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన లోక్ సభ స్పీకర్

  • కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం
  • ఇండియా కూటమితో పాటు తీర్మానాన్ని ఇచ్చిన బీఆర్ఎస్
  • అన్ని పార్టీలను సంప్రదించి చర్చ జరిగే తేదీని ప్రకటిస్తానన్న స్పీకర్
కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో విపక్ష కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన ఈ తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. మరోవైపు ఇండియా కూటమిలో లేని బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చింది. తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్.. అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం తగిన తేదీని నిర్ణయించేందుకు అన్ని పార్టీల నేతలతో చర్చిస్తానని తెలిపారు. తీర్మానంపై చర్చించే తేదీని సభ్యులందరికీ తెలియజేస్తానని చెప్పారు. మరోవైపు మణిపూర్ అంశంపై పార్లమెంటు ఉభయ సభలకు తీవ్ర అంతరాయం కలుగుతూనే ఉంది. ఈ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.


More Telugu News