పీవీ సింధును వెంటాడుతున్న తొలి రౌండ్ గండం.. 14 టోర్నీల్లో ఏడోసారి అదే తీరు
- జపాన్ ఓపెన్‌లోనూ తెలుగు షట్లర్‌కు చుక్కెదురు
- మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో పరాజయం
- కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌లో స్టార్ షట్లర్
భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. గాయాల నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ఆట గాడి తప్పింది. వరుస టోర్నీల్లో నిరాశపరుస్తూనే ఉంది. గతవారం కొరియా ఓపెన్‌లో మొదటి రౌండ్‌లో ఓడిన ఆమె ఈ రోజు జపాన్ ఓపెన్‌లోనూ పేలవ ఆటతీరు కనబరించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టింది.
ప్రపంచ 17వ ర్యాంక్‌కు పడిపోయిన సింధు 12–21, 13–21 తో వరుస గేమ్స్‌ల్లో చైనాకు చెందిన జాంగ్ యి మన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ప్రపంచ 18వ ర్యాంకర్ అయిన జాంగ్ యితో ఆడిన గత మూడు మ్యాచుల్లో సింధుకు ఇది రెండో ఓటమి కావడం విశేషం. ఇక, ఈ ఏడాది ఆడిన 14 టోర్నమెంట్లలో సింధు తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.